బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టంట్స్ కి క్వారంటైన్ అప్పటి నుంచేనా ?

Has the quarantine for Bigg Boss Season 5 contestants ever since?

0
90

తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఐదో సీజన్ లోకి అడుగు పెడుతుంది. అభిమానులు ఈ షో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ షో కి సంబంధించి ప్రోమో ఇప్పటికే షూట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్వాతంత్య దినోత్సవ కానుకగా ఆగష్టు 15న ప్రోమో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక షోని సెప్టెంబర్ తొలి వారంలో స్టార్ట్ చేయనున్నారట.

ఈ సారి కూడా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ఈ షో లో పాల్గొనడానికి సెలెక్ట్ అయినవారు ఆగష్టు 22 నుండి క్వారంటైన్ లో ఉంచడానికి అన్ని సిద్ధం చేశారట. అక్కడ పదిహేను రోజులు క్వారంటైన్ లో ఉంటారు అని తెలుస్తోంది. ఆ తర్వాత వారు హౌస్ లోకి ఎంటర్ అవుతారు. ఇక ఇప్పటికే రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

చాలా మంది పేర్లు వినిపించాయి. యాంకర్ రవి, లోబో, సినిమా హీరోయిన్ ఇషా చావ్లా, నవ్య స్వామి, యూట్యూబ్ నిఖిల్, డాన్సర్ ఆనీ మాస్టర్, జబర్దస్త్ వర్షిని, సీరియల్ ఆర్టిస్ట్ విజే సన్నీలు దాదాపుగా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్రోమో షూట్లు జర్నీ షూట్లు పూర్తి చేసింది. ఇక ఈనెలలో రెండు మూడు ప్రోమోలు రిలీజ్ కానున్నాయి. దీని కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో బిగ్ బాస్ గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి.