భీమ్లానాయ‌క్‌లో బ్ర‌హ్మానందం లుక్ చూశారా?

Have you seen the Brahmanandam look in Bhimlanai?

0
110

బ్రహ్మానందం ఆ పేరు వింటేనే అర్ధమవుతుంది కామెడీ కింగ్ అని. ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను నవ్వులు పూయించాడు బ్రహ్మి. తెలుగు తెరపై చెగని చిరువ్వును శాశ్వతంగా ఉంచిన కమెడియన్‌లలో బ్రహ్మానందం ఒకరు. తాజాగా బ్రహ్మానందం భీమ్లానాయక్‌ సినిమాలో నటించారు. ఆ సినిమాలో బ్రహ్మానందం లుక్‌ విడుదలైంది. ఇందులో బ్రహ్మీ పోలీసు పాత్రలో నటిస్తున్నారు.

ఇటీవల ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో బ్రహ్మానందం ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే నిర్మాతలు కూడా ఆ విషయాన్ని వెల్లడించారు. పోలీస్ గెటప్ లో ఉన్న బ్రహ్మానందం పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇప్పుడుఈ లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందిస్తున్నారు.

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన భీమ్లానాయక్‌ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహించగా, తమన్‌ మ్యూజిక్‌ అందించారు. అయితే మలయాళంలో సూపర్‌ హిట్‌ అందించిన అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది.