నందమూరి కల్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న సినిమా బింబిసార. ఎ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్.. అన్నది ఉపశీర్షిక. వశిష్ట్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో కేథరీన్, సంయుక్త మేనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కు ఊహించని విధంగా రికార్డులు సృష్టిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. ఇప్పుడు ‘రిలీజ్ ట్రైలర్’తో మరో ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడితో పాటు కల్యాణ్ రామ్ పోషించిన మరో పాత్రను ఇందులో చూడొచ్చు.
https://www.youtube.com/watch?v=aosg9hapID4&feature=emb_title
యుద్ధ విన్యాసాలు, పవర్‌ఫుల్ సంభాషణలు, విజువల్స్‌తో ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. హైదరాబాద్‌లో ఈ నెల 29న నిర్వహించనున్న ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నారు. కాగా ఇప్పటికే విడుదలైన ఈశ్వరుడే, తేనె పలుకులు పాటలు ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమాతోనైనా నందమూరి హీరో సక్సెస్ బాట పడతాడో లేదో చూడాలి.