‘బ్రహ్మాస్త్ర’ మేకింగ్​ వీడియో చూశారా?

0
103

స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్ర. టాలీవుడ్, బాలీవుడ్ పాపులర్ నటులు రణబీర్ అలియా భట్, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున ప్రధాన తారాగణంతో దర్శకుడు ఆయున్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులోని మొదటి భాగాన్ని ‘బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ’ పేరుతో విడుదల చేయనున్నారు. సెప్టెంబర్‌ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రబృందం ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇక తెలుగులో ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పణలో రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా చిత్ర దర్శకుడు అయాన్‌ ముఖర్జీ మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు.

ఈ చిత్ర కథ కాగితంపై నుంచి తెరపైకి వచ్చే వరకూ సాగిన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి షాట్‌ను సవాలుగా స్వీకరించి, తెరకెక్కించినట్టు పేర్కొన్నారు. బ్లూమ్యాట్‌ ఉపయోగించి యాక్షన్‌ సన్నివేశాలను ఎలా షూట్‌ చేశారో ఈ వీడియోలో కనిపిస్తుంది. నరాస్త్ర, నంది అస్త్ర, ప్రభాస్త్ర, జలాస్త్ర, పవనాస్త్ర, బ్రహ్మాస్త్రాల గురించి చెప్పే ఈ కథను తెరకెక్కించేందుకు ఓ దర్శకుడిగా ఆయనెంత కష్టపడ్డారో ఈ వీడియో తెలియజేస్తుంది.

https://www.instagram.com/stories/ayan_mukerji/?