ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్నారు, ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు ప్రభాస్, అయితే గత పది రోజులుగా ఇటలీలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. జాగ్రత్తలు తీసుకుని చిత్ర షూటింగ్ అక్కడ చేస్తున్నారు,ఈ నెలాఖరు వరకూ అక్కడే ఉంటుంది చిత్ర యూనిట్.
ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. రాధే శ్యామ్ సినిమాను కూడా 140 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ చిత్రాన్ని.
రాధే శ్యామ్ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు, గతంతో జిల్ చేసిన తర్వాత ఆయన ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేస్తున్నారు, అయితే ఇన్ని రోజులుగా రాధే శ్యామ్ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తున్నారో క్లారిటీ లేదు. తాజాగా దీనిపైక్లారిటీ ఇచ్చారు.
రాధే శ్యామ్ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు, ఆయన గతేడాది డియర్ కామ్రేడ్ సినిమాకు సంగీతం అందించారు.. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ విడుదల కానుంది.