రెబల్ స్టార్ మృతిపై హెల్త్ బులెటిన్ విడుదల..షాకింగ్ నిజాలు వెల్లడించిన AIG ఆస్పత్రి బృందం

0
102

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈరోజు తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు 3.25 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఇక తాజాగా ఆయన మృతిపై AIG ఆసుపత్రి అధికారిక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ లో షాకింగ్ నిజాలు వెల్లడించారు.

పోస్ట్ కోవిడ్ సమస్యలు రావడంతో రెబల్ స్టార్ కృష్ణం రాజు అసుపత్రిలో జాయిన్ అయ్యారు. చికిత్స అందిస్తున్న క్రమంలో  అర్థరాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఇబ్బంది, తాజా పరిస్థితి అత్యంత విషమంగా మారి కృష్ణంరాజు మరణించారని AIG ఆస్పత్రి బృందం  హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.