విలన్‌గా హెబ్బా పటేల్

విలన్‌గా హెబ్బా పటేల్

0
92

తెలుగు ఇండస్ట్రికి ’కుమారి 21ఎఫ్’ సినిమాతో అడుగు పెటిది హెబ్బా పటేల ఈ సినిమాతో యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న హెబ్బా , ఆ తరువాత అభిమానులను మెప్పించలేకపోయింది. హెబ్బా ఎంచుకున్న కథల్లో విషయం లేకపోవడం వలన అందాలు ఒలకబోయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే ¬తాజాగా హెబ్బా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట అయితే ఈ సారి హెబ్బా ఓకే చెప్పింది హీరోయిన్ రోల్ కోసం కాదు .. విలన్ పాత్ర కోసం.

నితిన్ హీరోగా ’భీష్మ’ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమాలో కథ నాయికగా రష్మిక మందన నటిస్తోంది. ఇక ఈ సినిమాలో లేడీ విలన్ పాత్ర కీలకంగా వుంటుందట. ఈ పాత్ర కి హెబ్బా పటేల్ అయితే బాగుంటుందని భావించి దర్శక నిర్మతలు ఆమెను సంప్రదిస్తే వెంటనే ఓకే చెప్పేసిందట. నెగెటివ్ షేడ్స్ కలిగిన ఈ పాత్రలో హెబ్బా ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి మరి.