హేమమాలిని ధర్మేంద్ర వివాహం పై సంచలన నిజం ఇదే

హేమమాలిని ధర్మేంద్ర వివాహం పై సంచలన నిజం ఇదే

0
118

బాలీవుడ్ లో టాప్ హీరో పేరు చెబితే ముఖ్యంగా ధర్మేంద్ర పేరు వినిపిస్తుంది. ఇటీవల తన 84వ పుట్టిన రోజు చేసుకున్నారు. 1935లో పంజాబ్లోని ఫగ్వాడాలో ఒక సిక్కు జాట్ కుటుంబంలో ధర్మేంద్ర జన్మించారు. 1958లో తొలిసారిగా ఆయన ఫిల్మ్ఫేర్ టాలెంట్ హంట్ కోసం ముంబై వచ్చారు. ఆ సమయంలో ఆయన దిల్ భీ తేరా సినిమాలో నటించారు, అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది.

ఇక ఆయనకు తిరుగు లేని సినిమాలు వెంట వెంటనే వచ్చాయి… సీతా ఔర్ గీతా సినిమా షూటింగ్ సమయంలో ధర్మేంద్ర హీరోయిన్ హేమమాలిని ప్రేమలో పడ్డారు. అయితే అప్పటికే ధర్మేంద్రకు వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. దీంతో వారిద్దరి మధ్య ఏదో ఉంది అని టాక్ నడిచింది.

ముందు ధర్మేంద్ర హేమమాలినికి ప్రపోజ్ చేశారట. ఆమె ముందు ఒప్పుకోలేదు, తర్వాత 1978లో హేమమాలిని తండ్రి మృతి చెందారు. దీంతో ఆమె ఒంటరి అయిపోయారు. ఈ సమయంలో ధర్మేంద్ర ఆమెకు అండగా నిలిచారు. ఫలితంగా హేమ.. ధర్మేంద్రను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.
అయితే చట్టాలు ఒప్పుకోవు కాబట్టి, 1979లో ఇస్లాం మతాన్ని స్వీకరించి, హేమ మాలినిని వివాహం చేసుకున్నారు ఆయన . అప్పటి నిఖా నామాలో ధర్మేద్ర పేరు దిల్వర్ ఖాన్, హేమమాలిని పేరు ఆయాషా అని ఉన్నాయి. అలా వారి వివాహం జరిగింది.