పూర్ణ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి , ఆమె సినిమాలు అంటే అభిమానులకి చాలా ఇష్టం, ఇటు సినిమా నటిగా మోడల్ గా ఆమె రాణించారు, ఆమె అసలు పేరు షామ్నా కాసిం.. నటి, మోడల్. ఆమె శాస్త్రీయ నృత్య కళాకారిణిగా కెరియర్ ప్రారంభించారు, తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ సినిమాలు అవును, అవును 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యారు.
ఈ సినిమాలో ఆమె నటనతో ఆమె తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గర అయ్యారు…పూర్ణ కేరళ లోని కానూరు లో కాసిం, రమ్లా బీవీ అనే దంపతులకు జన్మించింది. ఆమె తల్లిదండ్రులకు ఐదు మంది సంతానం. అందరిలోకి ఈమె చిన్నది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పేరు పూర్ణగా మార్చారు ..ఆమె స్కూలింగ్ చూసుకుంటే కానూరులోని ఉర్సులీన్ సీనియర్ సెకండరీ స్కూల్లో ప్రైమరీ స్టడీస్ చేశారు.
నృత్యంలో శిక్షణ సెయింట్ థెరీసా పాఠశాలలో తీసుకున్నారు. కేరళలోని కోచిలో ఆమె కుటుంబం ఉంటున్నారు.
కరెస్పాండెంస్ ద్వారా ఆంగ్లంలో బి.ఏ కూడా చేశారు…అమృత టివిలో ప్రసారమైన సూపర్ డ్యాన్సర్ అనే నృత్య పోటీల్లో పాల్గొనడం ద్వారా ఆమె బాగా పేరు సంపాదించారు.
చిత్ర సీమలో చూస్తే 2004 లో మలయాళ చిత్రం మంజు పొలోరు పెంకుట్టి ద్వారా తన సినిమా జర్నీ ప్రారంభించారు.
తెలుగులో ఆమె మొదటి సినిమా శ్రీ మహాలక్ష్మి. తర్వాత దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అవును అవును 2 సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు వచ్చాయి. తర్వాత ఆమె రాజుగారి గది సినిమాలో కూడా నటించింది.
ఆమె చేసిన సినిమాలు చూస్తే
జయమ్ము నిశ్చయమ్మురా
అవును
అవును 2
సీమ టపాకాయ్
రాజుగారి గది
సిల్లీ ఫెలోస్