హీరోయిన్ సంఘవి రియల్ స్టోరీ ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందంటే

హీరోయిన్ సంఘవి రియల్ స్టోరీ ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందంటే

0
115

సంఘవి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల తార, హీరోయిన్ గా ఆమె దాదాపు 95 సినిమాల్లో నటించింది, టాలీవుడ్ లో చాలా మంది అగ్రహీరోలతో సినిమాలు చేసింది, ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబంతో ఉంది, మరి ఆమె రియల్ స్టోరీ తెలుసుకుందాం.

సంఘవి పేరు కావ్య రమేష్.. కర్ణాటకలోని మైసూరులో 1977 అక్టోబరు 4న పుట్టింది. ఈమె తండ్రి మైసూరు వైద్య కళాశాలలో చెవి, ముక్కు, గొంతు విభాగానికి అధిపతి. ఈమె విద్యాభ్యాసం మైసూరులోని మారి మల్లప్ప పాఠశాలలో జరిగింది సంఘవి చదువుకుంటూనే మోడలింగ్ చేయటం ప్రారంభించింది. బాలనటిగా సినిమాలు చేసింది

ప్రముఖ కన్నడ సినిమా నటి ఆరతి, సంఘవి నాయనమ్మకు చిన్న చెల్లెలు అవుతారు. ఆరతి సినిమా షూటింగులకు వెళ్ళినప్పుడల్లా సంఘవి ఆమె వెంట వెళ్ళేది. అప్పుడే సినిమాలలో నటించాలన్న కోరిక ఆమెకి కలిగింది
సంఘవికి సింధూరం సినిమాకు ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చారు.
సంఘవి, కన్నడ, తెలుగు సినిమా నటి. 95కు పైగా సినిమాలలో నటించారు ఆమె.. దాదాపు తెలుగులో 45 సినిమాలు, కన్నడంలో ఒక ఆరు సినిమాలు. మిగిలిన చిత్రాలు తమిళంలో చేశారు..

సంఘవి తెలుగు సినిమా దర్శకుడు సురేష్ వర్మను శివయ్య సినిమా సమయంలో ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.. తర్వాత సినిమాలకు దూరమయ్యారు. కొద్ది గ్యాప్ తీసుకుని గోకులత్తిల్ సీత అనే టీవీ సీరియల్ తో బుల్లితెరపై కూడా అడుగుపెట్టింది.

సంఘవి నటించిన టాప్ తెలుగు చిత్రాలు
లాహిరి లాహిరి లాహిరిలో
ఇంద్రాణి
నాయుడుగారి కుటుంబం
మృగరాజు
శివయ్య
ప్రియమైన శ్రీవారు
తాజ్ మహల్
ఊరికి మొనగాడు
పెద్దమనుషులు
సమరసింహారెడ్డి
సరదా బుల్లోడు
సీతారామరాజు
సింధూరం
సూర్యవంశం
సందడే సందడి
ఆంధ్రావాలా