స్నేహమంటే ఇదే – స్నేహితుడి పుట్టిన రోజున ముంబై వెళ్లిన బన్నీ

Hero Allu Arjun went to Mumbai on a friend's birthday

0
80

అల్లు అర్జున్ స్నేహానికి చాలా విలువ ఇస్తారు. అంతేకాదు తన కుటుంబాన్ని, మిత్రులని చాలా బాగా చూసుకుంటారు. ఇక సినిమా ఇండస్ట్రీలో బన్నీ వాసు, అల్లు అర్జున్ మధ్య బంధం తెలిసిందే.వారిద్దరు మంచి మిత్రులుగా ఉంటారు. బన్నీ వాసు, అల్లు అర్జున్ దాదాపు రెండు దశాబ్దాల పాటు స్నేహితులుగా ఉన్నారు.

అయితే నిన్న బన్నీవాసు పుట్టిన రోజు ఈ సమయంలో బన్నీ వాసు ముంబైలోని ఓ సినిమా వర్క్ లో ఉన్నారు. అల్లు అర్జున్ తన మిత్రుడికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు అల్లు అర్జున్ ముంబై వెళ్లి బన్నీ వాసుని సర్ ప్రైజ్ చేశారు. దీంతో బన్నీ వాసు చాలా ఆనందించారు.

ప్రతీ ఏడాది బన్నీ హైదరాబాద్ లో బన్నీవాసు దగ్గరకు వెళ్లి విష్ చేసేవారు. అయితే ఈసారి మిత్రుడు ముంబైలో ఉండటంతో నేరుగా బన్నీ ముంబై వెళ్లి ఆయన్ని కలిసి విష్ చేశారు. అంతేకాదు ఈ సమయంలో బన్నీ కుమారుడు అయాన్ కూడా అక్కడకు వెళ్లారు. యూవీ క్రియేషన్స్ కు చెందిన వంశీ, కేదార్ సైతం ముంబై వెళ్ళారు. ఇక్కడ ఫోటోని చూడవచ్చు.