బ్రేకింగ్: హీరో అర్జున్ ఇంట తీవ్ర విషాదం

0
127

కన్నడ స్టార్ హీరో అయిన అర్జున్ సర్జా ఎన్నో సంవత్సరాలుగా పలు సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. ఈ హీరో కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించి మంచి పేరు సంపాదించుకున్నాడు. తాజాగా ఈ హీరో ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న అర్జున్ తల్లి లక్ష్మీదేవి ఉదయం మరణించారు. ఆమె బెంగుళూరు అపోలో ఆసుపత్రికి చికిత్స పొందుతూ మరణించినట్లుగా తెలుస్తోంది. దీంతో అర్జున్ సర్జా ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి.