ఆ దర్శకుడితో సినిమా – అభిమానులకి క్లారిటీ ఇచ్చిన బాలయ్య

Hero Bala Krishna Clarification on movie with gopichand malineni

0
114

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా చేస్తున్నారు. ఇందులో బాలయ్య లుక్ అద్భుతంగా ఉంది. ఇక బాలయ్య బాబుని వెండి తెరపై ఎప్పుడు చూద్దామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే బోయపాటితో బాలయ్య బాబుకి ఇది మూడో చిత్రం. ఇది సూపర్ హిట్ అవుతుందని బాలయ్య అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

ఇక బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా మరో చిత్రం పై కూడా క్లారిటీ ఇచ్చారు. దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయనున్నారు. కథానాయికగా శ్రుతి హాసన్ పేరు వినిపిస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో కీలక పాత్రకి వరలక్ష్మీ శరత్ కుమార్ ని కూడా తీసుకున్నారని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా తర్వాత మరో సినిమా పై కూడా క్లారిటీ వచ్చింది. బాలయ్య దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ చిత్రం చేస్తారు అని వార్తలు ఇటీవల వినిపించాయి. కాని దీనిపై క్లారిటీ అయితే రాలేదు. తాజాగా బాలయ్య అభిమానులతో జూమ్ మీట్ నిర్వహించారు. త్వరలో అనిల్ రావిపూడితో తన సినిమా ఉండనుందనే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో ఈ క్రేజీ మూవీపై కూడా అప్ డేట్ వచ్చే రోజుల్లో రానుందని, ఎదురుచూస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్ . సో చూడాలి అనిల్ రావిపూడి బాలయ్య బాబు కోసం ఎలాంటి స్టోరీ సిద్దం చేశారో.