Hero Balakrishna helps Assistant Director Mahesh Yadav: టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి మానవత్వం చాటుకున్నారు. ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మహేష్ యాదవ్ అనే వ్యక్తి బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. చికిత్సకు రూ.40 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దాంతో ఆ కుటుంబ సభ్యులు ఆర్థికసాయం కోసం ఎదురుచూశారు. విషయం తెలుసుకొని చలించిపోయిన బాలయ్య.. అతనికి హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందించారు. మెగా పవర్ స్టార్ హీరోగా, బోయపాటి దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ చిత్రానికి మహేశ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
రామ్ చరణ్ సినిమాకు పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్‌కు బాలయ్య సాయం
-