హీరో బాలకృష్ణ సంచలన నిర్ణయం..హిందూపురాన్ని జిల్లా చేయాలంటూ..

Hero Balakrishna's sensational decision to make Hindupur a district

0
105

కొద్దిరోజుల క్రితం ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పై కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే జిల్లాల పునర్విభజన పై చాలా చోట్ల వ్యతిరేకత వస్తోంది.

బాలయ్య నియోజకవర్గమైన హిందూపురాన్ని జిల్లా చేయాలంటూ..మొదటి నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ హిందూపురంకు చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ… సంచలన నిర్ణయం తీసుకున్నారు. జిల్లా సాధన కోసం రేపు పట్టణంలో మౌన ప్రదర్శన ర్యాలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ర్యాలీలో స్వయంగా తానే పాల్గొనాలని ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్ణయం తీసుకున్నారు.