హీరోగా జబర్దస్త్ ఆది ఎంట్రీ ఎలాంటి సినిమాలంటే

హీరోగా జబర్దస్త్ ఆది ఎంట్రీ ఎలాంటి సినిమాలంటే

0
87

జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్లు సినిమాల్లోకి వచ్చారు… అది మంచి ఫ్లాట్ ఫామ్ అందించింది అనే చెప్పాలి.. మఖ్యంగా జబర్దస్త్ లో చాలా ఫేమస్ అయిన వ్యక్తి అంటే ముందు వినిపించేది హైపర్ ఆది… తన స్కిట్ లతో అందరిని నవ్వించే వాడు. తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర అభిమానులకు జబర్ధస్త్ ఫ్యాన్స్ కు హైపర్ ఆది చాలా దగ్గర అయ్యాడు ఆయన స్కిట్ వస్తోంది అంటే టీవీల ముందు కూర్చుంటారు అందరూ.

తాజా ఇంటర్వ్యూలో అయన మాట్లాడుతూ …సుడిగాలి సుధీర్ అంటే నాకు చాలా ఇష్టం. మొదటిసారిగా మా పరిచయం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఆ తరువాత ఇద్దరం కలిసి కొన్ని స్కిట్స్ చేశాము. అని తెలిపాడు హైది, అయితే సుధీర్ సినిమాల్లో మంచి అవకాశాలు సాధించాడు, అలాగే సుధీర్ హీరో కావడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది అని తెలిపాడు ఆది.

తాను తప్పకుండా సక్సెస్ అవుతాడనే నమ్మకం వుంది. త్వరలో నేను కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం వుంది. నాకు పాటలు .. ఫైట్లు అంతగా సెట్ కావు, ఒకవేళ చేస్తే అవి కూడా కామెడీగా అనిపిస్తాయి. అందువలన పాటలు .. డాన్సులు లేని మంచి కథను చూసుకోవాలి భావిస్తున్నాను. ప్రస్తుతం కథలు వింటున్నాను … మంచి కథ దొరకాలంతే అని చెప్పుకొచ్చాడు. ఆది మొత్తానికి త్వరలో ఆది సినిమాల్లో హీరోగా కనిపించనున్నాడు అనేది తేలిపోయింది.