అభిమానులకి మహేశ్ బాబు పిలుపు – పుట్టిన రోజునాడు ఇలా చేయండి

hero mahesh babu birthday special

0
111

ఈనెల 9 వ తేదిన టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజు. ఇక ఈ రోజు అభిమానులు పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలి అని పిలుపుని ఇచ్చారు ప్రిన్స్ . తన పుట్టిన రోజున వేడుకలు వద్దు అని ప్రతీ ఒక్కరు మూడు మొక్కలు నాటాలి అని కోరారు మహేష్ బాబు.

ఈసారి ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని తెలిపారు. మొక్కలు నాటిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి తనని ట్యాగ్ చేయాలి అని కోరారు మహేష్ బాబు. ఆ ఫోటోలు నేను కూడా చూస్తాను అన్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. పరశురాం ఈ సినిమాకి దర్శకుడు. ఇక ఈ సినిమా షూటింగ్ గోవాలో జరగనుందని తెలుస్తోంది తదుపరి షెడ్యూల్.