టాలీవుడ్ హీరో నిఖిల్ (Hero Nikhil) తండ్రి అయ్యాడు. తన భార్య మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తన కొడుకుని ఎత్తుకుని ముద్దాడుతున్న ఫోటోను షేర్ చేశాడు. దీంతో సీనీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నిఖిల్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా 2020లో పల్లవి అనే అమ్మాయిని నిఖిల్ వివాహం చేసుకున్నాడు. ఇటీవల భార్య సీమంతం ఫొటోలు అభిమానులతో పంచుకున్నాడు.
ఇక అతడి సినిమాల విషయానికొస్తే కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇదే ఊపులో ఇప్పుడు ఏకంగా మూడు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం స్వయంభు, ది ఇండియా హౌస్, కార్తికేయ 3 ప్రాజెక్టులు నిఖిల్ చేతిలో ఉన్నాయి. త్వరలోనే ‘స్వయంభు’ చిత్రం విడుదల కానుంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ‘ది ఇండియా హౌస్’ నిర్మిస్తుండటం విశేషం.