హీరో నితిన్ ప్రేమ వివాహం పెళ్లి ఎక్కడ చేస్తున్నారంటే

హీరో నితిన్ ప్రేమ వివాహం పెళ్లి ఎక్కడ చేస్తున్నారంటే

0
92

నటుడు హీరో నితిన్ ప్రేమలో ఉన్నాడు, అవును నాలుగు సంవత్సరాలుగా శాలిని అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు, ఆమెను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసింది. వారిద్దరి వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారట.

అయితే నితిన్ వివాహం పై ఇది వరకే వార్తలు వచ్చాయి.. తాజాగా ఈ సమయంలో ఆయనది లవ్ మ్యారేజ్ అని తెలుస్తోంది, నితిన్ కు ఈ ఏడాది ఏప్రిల్ 16న వివాహ ముహూర్తం పెట్టుకున్నట్లు సమాచారం అందుతోంది, దుబాయ్ లో రిచ్ గా మారేజ్ చేసేందుకు ఇరు కుటుంబాలు ఫిక్స్ అయ్యాయి.

వధువు శాలిని.. యూకేలో ఎంబీఏ చేసింది. వారిద్దరి పెళ్లి పనులని నిర్మాత, నితిన్ సోదరి నిఖిత దగ్గరుండి చూసుకుంటోందని తెలిసింది. ఇక ముందుగా అనుకున్నట్టే దుబాయ్ లో వీరి వివాహం జరిపించాలి అని అనుకుంటున్నారు, దుబాయ్ లోని ప్యాలసో వర్సేస్ హోటల్ లో గ్రాండ్ గా పెళ్లి జరగనుంది.. పెళ్లి తర్వాత హైదరాబాద్లో బంధుమిత్రులకు విందు ఇవ్వనున్నారట. ప్రస్తుతం నితిన్ భీష్మ సినిమాలో నటిస్తున్నాడు.