హీరో నితిన్ పెళ్లి డేట్ ఇదే – వేదిక ఖ‌రారు

హీరో నితిన్ పెళ్లి డేట్ ఇదే - వేదిక ఖ‌రారు

0
111

ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో చాలా మంది సినిమా సెల‌బ్రెటీలు ఇంటిలో కుటుంబ సభ్యుల‌తో అతి త‌క్కువ మందితో వివాహ కార్య‌క్ర‌మాలు ముగిస్తున్నారు, బ‌య‌ట వారిని కూడా పిల‌వ‌డం లేదు, తాజాగా నితిన్ ఎంగేజ్ మెంట్ అయిన విషం తెలిసిందే.

అయితే వివాహానికి అన్నీ సిద్దం చేసుకున్న త‌ర్వాత ఈ వైరస్ తో పూర్తిగా లాక్ డౌన్ అమ‌లులో ఉంది..
కరోనా రావడంతో ఆయన పెళ్లిని వాయిదా వేసుకోవాల్సి వ‌చ్చింది.. ఇక ప్రియురాలు శాలినితో నిశ్చి తార్థం చేసుకున్న నితిన్, వివాహ డేట్ కోసం అంద‌రూ ఎదురుచూస్తున్నారు.

నితిన్ మొదట దుబాయ్‌ లో ఏప్రిల్ 16న డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవాలని భావించాడు. అయితే కరోనా కారణంగా అలా వేసుకున్న ప్లాన్ ముందుకుసాగలేదు. తాజాగా ఇరు కుటుంబాల స‌భ్యులు నిర్ణ‌యించి ఈ నెల 26న వివాహ ముహూర్తం ఫిక్స్ చేశారు . ఈ వివాహం హైదరాబాద్‌ లో వధువు ఇంటి వద్దే జరుగునుందట. దీంతో రానాతో పాటు నితిన్ కూడా ఇక వివాహం డేట్ వేదిక ఫిక్స్ చేశాడు.