తొలిసారి ఆ పాత్రలో హీరో ప్రభాస్..సందీప్‌ రెడ్డి స్పిరిట్‌ కోసం ఇలా..!

Hero Prabhas in that role for the first time..Sandeep Reddy is like this for Spirit ..!

0
105

జక్కన్న తీసిన బాహుబలి సినిమాతో హీరో ప్రభాస్‌ పాన్ ఇండియా హీరోగా మారాడు.  ప్రస్తుతం ప్రభాస్‌ నుంచి సినిమా వస్తుందంటే అది ఏ లెవల్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్ల క్రితం వచ్చిన సాహూ తరువాత ప్రభాస్ నుండి సినిమా రాకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు.

అయితే అభిమానుల వెయిటింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఈ సంక్రాంతికి రాధేశ్యామ్‌ విడుదలకానున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించిన ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి సంక్రాంతికి రాధేశ్యామ్ వస్తాడా లేక మరో తేదీన సందడి చేస్తాడో.

ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమాపై ఓ అప్డేట్ ఇప్పుడు అభిమానులకు బూస్ట్ ఇస్తుంది. అర్జున్‌ రెడ్డి మూవీతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్‌ వంగా డైరెక్షన్‌లో ప్రభాస్‌ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్‌ ఒక పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ గతంలో ఎన్నడూ పోలీస్‌ పాత్రలో నటించలేదు. అయితే తొలిసారి ప్రభాస్‌ను పోలీస్‌ పాత్రలో చూపించడానికి సందీప్‌ సిద్ధమవుతున్నాడని జోరుగా చర్చ నడుస్తోంది. ఇది నిజమో కాదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే..!