హీరో ప్రభాస్ పై కేసు నమోదు…

హీరో ప్రభాస్ పై కేసు నమోదు...

0
97

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరో ప్రభాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు… హైదరాబాద్ లోని రాయదుర్గం పీఎస్ లో రెవిన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు ప్రభాస్ పై కేసు నమోదు చేశారు..

లాక్ డౌన్ సమయంలో రాయదుర్గంలో ఉన్న సర్వే నంబర్ 46 ప్రభుత్వ భూమిలో ఉన్న తన గెస్ట్ హౌస్ లోనికి ప్రభాస్ ప్రవేశించడానికి ప్రయత్నించారు… దీంతో సేరిలింగంపల్లి అధికారులు ఆయన్ను అడ్డుకుని గెస్ట్ హౌస్ ను సీజ్ చేశారు..

కాగా జీవో నెంబర్ 59 కింద దీన్ని క్రమద్దీకరించాలని దరఖాస్తు కూడా చేసుకున్నాడు అయితే ఆ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ గతంలో శేరిలింగంపల్లి తహసీల్దార్ వాసుచంద్ర స్వాధీనం చేసుకుని సీజ్ చేసిన సంగతి తెలిసిందే… మరో వైపు ఈ కేసుకు సంబంధించి కూకట్ పల్లి కోర్టులో ట్రయిల్ జరుగనుంది..