హీరో రాజశేఖర్ కారుకు ఘోర రోడ్డు ప్రమాదం

హీరో రాజశేఖర్ కారుకు ఘోర రోడ్డు ప్రమాదం

0
119

ప్రముఖ నటుడు హీరో రాజశేఖర్ కు పెను కారు ప్రమాదం జరిగింది..అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రాజశేఖర్ కారు బోల్తా పడింది. ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది అని తెలుస్తోంది. ప్రమాదంలో రాజశేఖర్ తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. టీఎస్ 07 ఎఫ్జెడ్ 1234 నెంబరు కలిగిన లగ్జరీ కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాజశేఖర్ హై ఎండ్ లగ్జరీ కారులో ప్రయాణం చేస్తున్నారు. కారు ప్రమాదం జరిగిన వెంటనే ఆయనని ఆస్పత్రికి వేరే కారులో తరలించారు.

ముఖానికి గాయాలు కావడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు ప్రమాదానికి గురి అయ్యే సమయంలో 180 కిలోమీటర్ల వేగంతో కారు వెళుతోంది అని మీటర్ చూపిస్తోంది.ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు పోలీసులు. రాజశేఖర్ కు ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా యాక్సిడెంట్ జరిగింది. రెండేళ్ల క్రితం పీవీఎన్ఆర్ ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ లో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి రాజశేఖర్ బయటపడ్డారు. తన కారుతో మరొకరి వాహనాన్ని ఆయన ఢీకొట్టారు. అయితే బాధితుడు రామిరెడ్డితో వివాదం పరిష్కరించుకోవడంతో పోలీసులు నమోదు చేయలేదు. ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల్లో రాజశేఖర్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పలు సినిమాలు కూడా ఆయన చేస్తున్నారు.. గరుడవేగ కల్కితో మంచి సక్సస్ లో ఉన్నారు రాజశేఖర్.