హీరో రాజ‌శేఖ‌ర్ కూతుళ్లు భారీ సాయం ఏం చేశారంటే

హీరో రాజ‌శేఖ‌ర్ కూతుళ్లు భారీ సాయం ఏం చేశారంటే

0
111

క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్ మ‌న తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఉంది, ఈ స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి చాలా మంది పెద్ద‌లు విరాళాలు అందిస్తున్నారు.. ఇక సినిమా ప‌రిశ్ర‌మ నుంచి సినిమా క‌ళాకారుల కోసం ఓ యూనిట్ గా ఏర్ప‌డి వారి కోసం విరాళాలు సేక‌రిస్తున్నారు ..వారికి తోచిన సాయం నిత్య అవ‌స‌ర వ‌స్తువులుకూడా అందిస్తున్నారు.

సినిమా ప‌రిశ్ర‌మ‌లో రోజువారి వేతనం పొందే సినీ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు టాలీవుడ్ సినీ పరిశ్రమ కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేశారు.. తాజాగా రాజశేఖర్ తనయలు శివాని, శివాత్మికలు ఒక్కొక్కరు రూ.1లక్ష చొప్పున సి.సి.సికి విరాళంగా అందించారు.

ఇప్ప‌టికే రాజ‌శేఖ‌ర్ చాలా మందికి సాయం చేస్తున్నారు… న‌గ‌దు నిత్య అవ‌స‌ర‌వ వ‌స్తువులు కూడా ఆయ‌న అందిస్తున్నారు, పైగా ఆయ‌న చేసే దానాలు సేవ‌లు ఎవ‌రికి తెలియ‌నివ్వ‌రు.. తాజాగా ఆయ‌న కుమార్తెలు ఇలా విరాళం అందివ్వ‌డం పై టాలీవుడ్ ప్ర‌ముఖులు వారిని అభినందిస్తున్నారు.