హీరో రాజశేఖర్ డిశ్చార్జ్ -ఆస్పత్రిలో స్టాఫ్ డాక్టర్లు ఏం చేశారంటే

హీరో రాజశేఖర్ డిశ్చార్జ్ -ఆస్పత్రిలో స్టాఫ్ డాక్టర్లు ఏం చేశారంటే

0
113

ఇటీవల తనకి తన కుటుంబానికి కోరోసా సోకింది అని తెలిపారు హీరో రాజశేఖర్ ..తర్వాత ఆయనకు ఆరోగ్యం కాస్త నలతగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆయనని ఆస్పత్రికి తరలించారు, ఇక తర్వాత ఇద్దరు కుమార్తెలకి అలాగే భార్య జీవితకు కూడా కరోనా నెగిటీవ్ వచ్చింది, కాని రాజశేఖర్ కు మాత్రం కరోనా తగ్గలేదు.

ఈ సమయంలో ఆయన కుమార్తె కరోనాతో పోరాడుతున్న నాన్న గురించి ట్వీట్ చేసింది, ఈ సమయంలో టాలీవుడ్ లో అందరూ ఆందోళన చెందారు.. ఆస్పత్రి వైద్యులతో కూడా మాట్లాడారు, ఇటు ఆయన కోలుకుంటున్నారు అని జీవిత అలాగే ఆస్పత్రి వైద్యులు తర్వాత తెలిపారు.

అయితే తాజాగా అభిమానులకి గుడ్ న్యూస్ ఏమిటి అంటే, హీరో రాజశేఖర్ కోలుకున్నారు,
ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆయన చివరగా వెళుతూ డాక్టర్లు నర్సులు అందరితో కలిసి ఫోటో దిగారు, ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.