హీరో రాజశేఖర్ జీవిత పెళ్లికి ముందు ఇంత జరిగిందా

హీరో రాజశేఖర్ జీవిత పెళ్లికి ముందు ఇంత జరిగిందా

0
113

తెలుగు తెరపై హిట్ పెయిర్ గా చెప్పాలి అంటే జీవిత రాజశేఖర్ అనే చెబుతారు, ఇద్దరిలో ఎవరిని పిలిచినా జీవితా రాజశేఖర్ అనే పిలుస్తారు, అయితే పలు సినిమాల్లో వీరి జంటకు 100 మార్కులు పడేవి.. ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు అప్పట్లో భారీ విజయాలను అందుకున్నాయి. ఈ ఇద్దరి ప్రేమ – పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే, అయితే వీరి పెళ్లికి దారితీసిన పరిస్దితులు తాజాగా రివీల్ అయ్యాయి.

అప్పట్లో ఓ తమిళ నిర్మాత రాజశేఖర్ జోడీగా జీవితను తీసుకున్నారు. అప్పుడే తొలిసారిగా జీవితను చూసిన రాజశేఖర్,ఆమెను సినిమాలో వద్దు అని చెప్పారట, కాని దర్శక నిర్మాతలు మాత్రం ఆమెని కొనసాగించమని చెప్పారు, తర్వాత తలంబ్రాలు సినిమా చేశారు, అప్పుడు ఇద్దరి మధ్య మంచి పరిచయం పెరిగింది, అలా ప్రేమగా మారింది.

ఆ తరువాత ఆహుతి సినిమాలోను కలిసి నటించారు. ఆ సినిమా షూటింగులో రాజశేఖర్ గాయపడినప్పుడు, జీవిత ఆయన దగ్గరే ఉంటూ కంటికి రెప్పలా చూసుకున్నారు. ఆమె ప్రేమచూసిన రాజశేఖర్ కూడా ఆశ్చర్యపోయారు, ఇద్దరు ఎంతో ఇష్టపడుతున్నారు అని తెలుసుకుని రెండు కుటుంబాలు వీరి ప్రేమని ఆశీర్వదించి వివాహం జరిపించారు.