హీరో రాజశేఖర్ కూతురితో రాహుల్ సిప్లిగంజ్

హీరో రాజశేఖర్ కూతురితో రాహుల్ సిప్లిగంజ్

0
100

నటుడు హీరో రాజశేఖర్ జీవిత ముద్దుల కూతురు శివాత్మిక దొరసాని సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది.. అయితే తర్వాత పలు సినిమాల కథలు వింటున్నారు పేరెంట్స్.. వారికి నచ్చిన సినిమా కోసం ఇంకా కథలు వింటున్నారు, ఇక తాజాగా ఆమె కృష్ణవంశీ సినిమాలో ఛాన్స్ కొట్టింది.
ప్రస్తుతం కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాను రూపొందిస్తున్నాడు. నట సామ్రాట్ అనే మరాఠీ మూవీకి ఇది రీమేక్ చిత్రంగా చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ కూడా ఇటీవల ఛాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే .. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో శివాత్మిక కు రాహుల్ ని జోడీగా తీసుకున్నారట
ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. బ్రహ్మానందం .. అనసూయ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు.

ఇక వీరిద్దరికి సంబంధించి షూటింగ్ కూడా స్టార్ట్ అయింది అని తెలుస్తోంది.. పలు సన్నివేశాలు ఇద్దరి మధ్య షూట్ జరిగాయట.. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు, సో రాహుల్ కు ఇది మంచి విజయం ఇస్తుంది అంటున్నారు అభిమానులు.