హీరో రాజశేఖర్ ట్వీట్ చిరు మోహన్ బాబుపై కామెంట్

హీరో రాజశేఖర్ ట్వీట్ చిరు మోహన్ బాబుపై కామెంట్

0
99

మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో హీరో రాజశేఖర్ చిరంజీవి మధ్య జరిగిన వివాదం ఇప్పుడు పెద్ద ఎత్తున టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది..ఈ వివాదం కారణంగా ఆ అసోసియేషన్ ఉపాధ్యక్ష పదవికి రాజశేఖర్ రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు, అంతేకాదు దీనిపై ఆయన ట్వీట్ కూడా చేశారు

చిరంజీవితో కానీ, మోహన్ బాబుతో కానీ తనకు ఎటువంటి గొడవలు లేవని స్పష్టం చేసిన రాజశేఖర్.. తనకున్న విభేదాలు మా అధ్యక్షుడు నరేష్ అని తెలియచేశారు, ఈరోజు ఆ కార్యక్రమంలో జరిగిన గొడవ నాకు నరేష్ కు మధ్య మాత్రమే అని తెలిపారు ఆయన. నాకు మోహన్ బాబుకు చిరంజీవికి ఎలాంటి వివాదాలు లేవు అన్నారు.

అతిథులకు కలిగిన అసౌకార్యానికి నేను క్షమాపణ చెబుతున్నాను. నేను ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశాను. ఇకపై ఇండస్ట్రీకి ఏది చేయాలన్న నా సొంతంగా చేస్తానన్నారు, నాకు చిరంజీవికి మోహన్ బాబుకి మధ్య జరిగిన వివాదంగా దీనిని చిత్రీకరించకండి అని ట్వీట్ ద్వారా తెలిపారు ఆయన.