ఆ యంగ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా – టాలీవుడ్ టాక్

0
101

రామ్ చరణ్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు రామ్ చరణ్. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. అయితే తాజాగా మరో సినిమా కూడా ఒకే చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. యువ దర్శకుడు సుజీత్ తో ఆయన సినిమా చేయనున్నారు అని టాలీవుడ్ టాక్ నడుస్తోంది.

సాహో సినిమాని తీశారు సుజీత్ ఇక భారీ బడ్జెట్ సినిమాలు ఈజీగా ఆయన చేస్తారు అని ఈ సినిమాతో అర్ధం అయింది. అప్పట్లో లూసిఫర్ రీమేక్ బాధ్యతలను సుజీత్ కి అప్పగించబోతున్నారు అనే వార్తలు వినిపించాయి, కాని చివరి నిమిషంలో చరణ్ మనసు మార్చుకున్నారు.

అయితే ఓ మంచి స్టోరీ రాయమని కచ్చితంగా సినిమా చేస్తాను అని చెప్పారట చరణ్. దీంతో సుజీత్ ఇటీవ‌ల చ‌ర‌ణ్ కు ఓ మంచి లైన్ వినిపించార‌ని తెలుస్తోంది. ఈక‌థ న‌చ్చ‌డంతో
చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.శంకర్ సినిమాను పూర్తిచేసిన తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని చిత్రపురిలో టాక్స్ నడుస్తున్నాయి.