మాస్ మహారాజ రవితేజ(Ravi Teja)కు తన తాజా సినిమా RT75 షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫైట్‌సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే సర్జరీ అయి ఉన్న కుడిచేతికి ఈ ప్రమాదంలో మరోసారి గాయమైంది. దీంతో వెంటనే స్పందించిన మూవీ టీమ్ రవితేజను యశోద హాస్పిటల్‌లో చికిత్సకు తీసుకెళ్లారు. కాగా రవితేజ కుడిచేతి నరాలు చిట్లినట్లు వైద్యులు చెప్పారు. ఈ క్రమంలోనే రవితేజ హాస్పిటల్ బెడ్‌పై స్పృహ తప్పి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోను చూసిన అభిమానులు తడల్లిపోతున్నారు. కాగా ఈ విషయంలో సినీ వర్గాలు తాజాగా భారీ ట్విస్ట్ ఇచ్చారు.
రవితేజ(Ravi Teja)కు సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగిన మాట వాస్తవమే కానీ.. వార్తల్లో చెప్తున్నంత సీరియస్ ఏమీ లేదని సినీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ఫొటోలు చూపినట్లు రవితేజ చేతికి శస్త్ర చికిత్స చేయడం, నోటి నుంచి ఆక్సిజన్ అందిస్తూ, గుండెపై ఈసీజీ వైర్లు, కుడిచేతి నుంచి తీవ్ర రక్తస్రావం అవుతున్న ఫొటో అంతా ఫేక్ అని సినీ వర్గాలు తేల్చి చెప్పాయి. రవితేజకు ప్రమాదం జరిగినా అందులో సీరియస్ ఏమీ లేదని, కాబట్టి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. దీంతో రవితేజ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.