హీరో రవితేజ కి భారీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

హీరో రవితేజ కి భారీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

0
105

హిట్లు- ఫ్లాఫ్స్ అనే తేడా లేదు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళతారు రవితేజ, మాస్ మహారాజ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు బద్దలు కొట్టాయి, అగ్ర దర్శకులు అందరితో ఆయన నటించారు, ఇక ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాలు సెట్స్ పై పెడతారు రవితేజ.

అయితే ఆయన సినిమాలు కామెడీ కానీ ఫైట్స్ కానీ ఎక్కడ తగ్గకుండా ఫుల్ జోష్ లో ఉంటాయి. ఇక ఆయన పారితోషికం కూడా భారీగానే ఉంది అని టాలీవుడ్ లో టాక్ నడుస్తున్నాయి,. ఒక్కో సినిమాకి 10 కోట్లు తీసుకుంటారని టాక్ . రాజా ది గ్రేట్ సినిమా తర్వాత కూడా ఆయన 12 నుంచి 15 కోట్లు డిమాండ్ చేస్తున్నారు అని టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం రవితేజ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో మరో సినిమాకి ఓకే చెప్పాడు. అయితే ఆయన సినిమాలు కమర్షియల్ గా హిట్ అవుతాయి, అంతేకాదు ఆయనకు మంచి వసూళ్లు వచ్చిన రికార్డులు ఉన్నాయి… ఇక రవితేజతో సినిమా అంటే నిర్మాత సేఫ్ అంటారు, ఎందుకు అంటే భారీ లాభాలు లేకపోయినా పెట్టుబడి కచ్చితంగా వస్తుంది అంటారు రవితేజ సినిమాతో.