ఆత్మహత్యకు పాల్పడిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ గురించి అనేక విషయాలు ఇప్పుడు తెలుస్తున్నాయి, ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు, అయితే పలువురిని సన్నిహితులని ప్రియురాలిని కూడా పోలీసులు విచారించారు.
2019 జులై నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ శ్రుతి.. సుశాంత్ వద్ద పనిచేశారు. సుశాంత్ నెలకు 10 లక్షల రూపాయల వరకూ ఖర్చు చేసేవారని ఆమె పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు.
బాంద్రా అపార్ట్మెంట్కు నెలకు 4.5 లక్షల రూపాయలు అద్దె చెల్లించేవారని, లొనావాల సమీపంలో తాను లీజుకు తీసుకున్న ఫాంహౌస్కు లక్షల రూపాయల్లో అద్దె చెల్లించేవారని తెలుస్తోంది.
అంతేకాదు రేంజ్ రోవర్, మాసరెటి వంటి లగ్జరీకార్లతో పాటు బీఎండబ్ల్యూ బైక్ కు కూడా అనేక ఖర్చులు ఉండేవి, ఇక నాలుగు సినిమాలు కోసం సుశాంత్ పని చేస్తున్నారు అని తెలిపారు, నెలకి సుమారు 10 లక్షల వరకూ అన్నీ ఖర్చులు ఉండేవట.