చై, సామ్ మధ్యలో హీరో సిద్దార్ధ్..అసలు ఏం జరిగిందంటే?

0
108

టాలీవుడ్ లవ్ లి కపుల్ సమంత, నాగచైతన్య విడిపోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌ట‌న ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. స‌మంత పేరును ప్ర‌స్తావించ‌కుండా ఆయ‌న ఈ ట్వీట్ చేశాడు. ‘పాఠ‌శాల‌లో మా టీచర్ నేర్పిన తొలిపాఠం ఇది. మోసం చేసే వారు ఎప్పుడూ బాగుపడరని సిద్థార్థ్ అన్నాడు.

సిద్దార్ధ్ ఈ ట్వీట్ సమంత గురించే చేసారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా అప్ప‌ట్లో సిద్ధార్థ్‌, స‌మంత ప్రేమించుకున్నారని, క‌లిసి తిరిగిన రోజుల‌ను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకోక‌ముందు రోజుల‌ను గుర్తు చేసుకుంటూ సిద్ధార్థ్ ఈ ట్వీట్ చేశాడంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

అయితే ఈ విషయంలో సమంత ఫ్యాన్స్ సిద్ధార్థ్ ను టార్గెట్ చేస్తున్నారు. నిజంగానే సిద్ధార్థ్.. సమంతను మోసగత్తె అని అన్నాడే అనుకుందాం. మరి సిద్ధార్థ్ కూడా గతంలో వివాహం చేసుకొని ఆ అమ్మాయిని వదిలేశాడు కదా? ఒక వేళ సిద్ధార్థ్ ను సమంత వదిలించుకొని ఉంటే, అది మోసమే అయితే.. అంతకుముందు సిద్ధార్థ్ లైఫ్ లో జరిగినదానిని ఏమనాలి అంటూ ప్రశ్నిస్తున్నారు.

https://twitter.com/Actor_Siddharth