ఈ కరోనా వైరస్ పంజా విసురుతోంది, ఎక్కడా కేసులు తగ్గడం లేదు, దారుణంగా ఇది విజృంభిస్తోంది, ముఖ్యంగా సినిమా నటులు దర్శకులు నిర్మాతలు కూడా వైరస్ బారిన పడుతున్నారు, అందుకే సినిమాలు సీరియల్స్ కామెడీ షోలు కూడా షూటింగ్ లు నిలిచిపోయాయి.
ఇటీవల కరోనా బారినపడిన నిర్మాత పోకూరి రామారావు చనిపోయిన సంగతి మర్చిపోక ముందే, మరో ఘటన చోటు చేసుకుంది… తెలుగులో ఈ రోజుల్లో సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన యువ హీరో శ్రీ ఇంట్లో విషాదం నెలకొంది.
ఆయన తండ్రి మంగం వెంకట దుర్గా రాంప్రసాద్ కరోనాతో మరణించారు. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు, ఈ సమయంలో ఆయనని విజయవాడ ఆస్పత్రిలో చేర్చారు,శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో మరణించాడు. దీంతో ఆయన ఇంట విషాదం నెలకొంది.