హీరో సూర్య మంచి మనసు..వారికి రూ.కోటి విరాళం

0
106

స్టార్​ కపుల్​ సూర్య, జ్యోతిక మరోసారి మంచి మనసును చాటుకున్నారు. తమిళనాడులోని ఆదివాసీల సంక్షేమం కోసం రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. సీఎం స్టాలిన్​ సమక్షంలో తమిళనాడుకు చెందిన ఇరులర్​ ట్రైబ్​ ట్రస్ట్​కు చెక్​ అందజేశారు. అంతకముందు కరోనా సమయంలోనూ తమ రాష్ట్ర సీఎం రిలీఫ్​ ఫండ్​కు ఈ దంపతులు విరాళం ఇచ్చారు.

సూర్య నటించిన కొత్త చిత్రం ‘జై భీమ్’​.. నవంబరు 2నుంచి తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అమెజాన్​ ప్రైమ్​లో స్ట్రీమింగ్​ కానుంది. జ్ఞానవేల్‌ దర్శకుడు. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఓ కోర్టు డ్రామా కథాంశంతో ఈ చిత్రం రూపొందించారు. ఏ తప్పు చేయని బలహీన వర్గ(ఆదివాసి) మహిళను కేసు నుంచి బయటపడేసే లాయర్ పాత్రలో సూర్య కనిపించనున్నారు.

అలాగే సూర్య ఈ ఏడాది ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ అందుకుంది. ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు సూర్య.