‘ఆకాశమే నీ హద్దురా’ కాంబినేషన్ రిపీట్..విభిన్నమైన పాత్రలో హీరో సూర్య

'Akashame nee haddura' combination repeat..hero Surya in a different role

0
92

జై భీమ్​ సినిమాతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు తమిళ కథానాయకుడు సూర్య. ఇప్పుడు సుధా కొంగర దర్శకత్వంలో మరో మూవీకి రెడీ అవుతున్నారు ఈ తమిళ హీరో. దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్‌కు సినీప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉంది. ఈ ఇద్దరి నుంచి వచ్చిన ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రం ఓటీటీ వేదికగా విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు ఈ హిట్‌ కలయికలో మరో సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం.

ఈ ప్రాజెక్ట్‌ కోసం సుధా ఓ విభిన్నమైన గ్యాంగ్‌స్టర్‌ కథాంశాన్ని సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ కథాంశానికి తగ్గట్లుగా ఇందులో సూర్యని ఓ శక్తిమంతమైన గ్యాంగ్‌స్టర్‌గా చూపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. స్క్రిప్ట్‌ ఆసక్తికరంగా ఉండటంతో సూర్య సినిమాకి ఓకే చెప్పారని వార్తలొస్తున్నాయి. ‘వాడి వాసల్‌’ సినిమా పూర్తయిన వెంటనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు హీరో సూర్య ‘ఈటీ’ (ఎతర్​క్కుమ్​ తునిందవన్) కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు, తమిళం సహా ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. ఈ చిత్రంలో సూర్యకి జోడిగా ప్రియాంక అరుల్‌ మోహన్‌ నటిస్తోంది. వినయ్‌రామ్‌, సత్యరాజ్‌, జయప్రకాశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి. ఇమ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు.