వెంకటేష్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్

వెంకటేష్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్

0
93

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా ఇష్టం.. నాటి నుంచి నేటి వరకూ ఫ్యామిలీ సినిమాలు చూస్తే వెంకీలో ఏ మార్పు లేదు అంటారు, మహిళా అభిమానులు కూడా వెంకటేష్ కి అలాగే ఉంటారు, ఇక విక్టరీ తన సింబాలిక్ గా సినిమాలు చేశారు ఆయన.

టాలీవుడ్ లో మళ్లీ కొత్త ట్రెండ్ అదే మల్టీస్టారర్ సినిమాలు చేసిన ఘటన కూడా ఆయనదే, అందుకే ఆయనతో సినిమా అంటే ఏ కోస్టార్ అయినా ఎస్ చెబుతారు. ఇటీవల తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకుంటూ, మల్టీ స్టారర్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు..

ఈ తరహాలో ఆయన చేసిన ఎఫ్ 2 భారీ విజయాన్ని సాధించింది. అంతేకాదు అనుకున్నదానికి మూడు రెట్లు కలెక్షన్లు తెచ్చిపెట్టింది, అయితే దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్ 3కి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం వెంకటేశ్ కి గతంలో కంటే ఎక్కువ పారితోషికం ఇవ్వాలా? లేక లాభాల్లో వాటా ఇవ్వాలా? అనే విషయంలో ఇప్పుడు నిర్మాతలు ఆలోచనలో ఉన్నారట. అయితే వెంకీకి సుమారు 10 కోట్ల రూపాయల పైనే రెమ్యునరేషన్ వస్తుంది అని టాక్ నడుస్తోంది