ఈ లాక్ డౌన్ తో దేశంలో చాలా రంగాలు ఇబ్బంది పడుతున్నాయి, ముఖ్యంగా సినిమా రంగం కూడా రెండు నెలలుగా చాలా ఇబ్బందుల్లో ఉంది, ఇక తాజాగా ఈ సమయంలో కొత్త సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు, లాక్ డౌన్ తో థియేటర్లు మూత పడ్డాయి, ఇక లాక్ డౌన్ తర్వాత జనాలు హాల్స్ కు వస్తారా రారా అనే పరిస్దితి నెలకొంది.
ఈ సమయంలో కచ్చితంగా కొత్త సినిమాలపై కూడా ఇది ప్రభావం పడుతోంది, ఇక ఇప్పుడు సెట్స్ పై ఉన్న సినిమాల విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, నిర్మాతలకు ఇది పెద్ద పరీక్ష అనే చెప్పాలి, అందుకే కచ్చితంగా హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సిందే అని చాలా మంది ఇప్పటికే సూచిస్తున్నారు.
తాజాగా ఈ విషయంలో ముందుకు వచ్చారు, కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని, ఆయన ఓ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. తన రెమ్యునరేషన్ 25 శాతం మేర తగ్గించుకున్నట్లు స్పష్టం చేశారు. ఆయన త్వరలో మూడు సినిమాలు చేయనున్నారు, ఈ మూడు సినిమాలు తమీజసరన్, అగ్ని సిరాగుగల్, ఖాకీ, ఈ సినిమాలకు తన రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్నట్లు ప్రకటించారు, ఇప్పుడు ఈ హీరోని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి అని పిలుపు వస్తోంది దేశ వ్యాప్తంగా.
.