విడాకుల తర్వాతే అమ్మ నాన్న హ్యాప్పీ : శృతి హాసన్ | చెల్లి దర్శకత్వంలో నటిస్తా

sruthi haasan aksharan haasan sruthi haasan boyfriend

0
108

సినిమాల్లో తండ్రికి తగ్గ తనయ గా పేరు తెచ్చుకున్నది హీరోయిన్ శృతి హాసన్. ఆమె లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ముంబైలోని తన నివాసంలో ప్రియుడితో కలిసి ఉంటున్నది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన మిత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తోంది శృతి.

తన తల్లిదండ్రుల వైవాహిక బంధం, విడాకులకు సంబంధించిన అంశాలపైనా శృతి స్పందించింది. వైవాహిక బంధంలో భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తే విడిపోవడమే మంచిదని, అదే పని తన తల్లిదండ్రులు చేశారని పేర్కొన్నది. వారిద్దరు కలిసి ఉన్నప్పటికంటే విడిపోయిన తర్వాతే సంతోషంగా ఉన్నారని వివరించింది.

తన చెల్లెలు అక్షరకు దర్శకత్వ శాఖలో బాగా ఇంట్రెస్ట్ ఉందని, ఆమె దర్శకత్వం వహించే చిత్రంలో నటించాలన్న కోరిక ఉందని వెల్లడించింది.తనకు సరిపడిన కథ సమకూరితే ఖచ్చితంగా ఆమె దర్శకత్వంలో నటిస్తానని చెప్పింది.

లాభం సినిమా షూటింగ్ సమయంలో దివంగత దర్శకుడు జననాథన్ తో మంచి పరిచయం ఏర్పడిందని, ఆయన సమయంలో ఆయన తనకు కమ్యూనిజం గురించి అనేక విషయాలు చెపారని వివరించింది.