ఎన్టీఆర్ సినిమాకి హీరోయిన్ ఫిక్స్ చేసిన త్రివిక్రమ్

ఎన్టీఆర్ సినిమాకి హీరోయిన్ ఫిక్స్ చేసిన త్రివిక్రమ్

0
94

టాలీవుడ్ హీరోలతో ఇప్పుడు జోడి కడుతున్న హీరోయిన్ అంటే ముందు వినిపించే పేరు రష్మికది, అయితే ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి, ఆమెకు అంతలా అవకాశాలు రావడానికి కారణం ఆమె సినిమాలు కూడా హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. ఇటీవలే మహేశ్ జోడీగా ఆమె చేసిన సరిలేరు నీకెవ్వరు భారీ విజయాన్ని అందించింది. సుకుమార్ తో బన్నీ చేయనున్న సినిమాలో కథానాయికగా ఆమె ఛాన్స్ కొట్టేసింది.

దాదాపు తెలుగులో అగ్రహీరోల సినిమాలు అంటే ఆమెని సెలక్ట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు, తాజాగా అల వైకుంఠపురములో సినిమాతో విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్ తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట.

అయితే ఎన్టీఆర్ కూడా ఆమెని ఒకే చేశారు అని తెలుస్తోంది, ఈ జోడి బాగుంటుంది అని కూడా చిత్ర యూనిట్ భావిస్తోందట. అయితే ఆర్ ఆర్ ఆర్ చిత్రం తర్వాత ఇది స్టార్ట్ అవ్వనుంది.. మరో పక్క బన్నీ సినిమా ఈసమయంలో పూర్తి అవుతుంది కాబట్టి నెక్ట్స్ ఎన్టీఆర్ తో ఆమె నటిస్తారు అని తెలుస్తోంది, ఎన్టీఆర్ తో సినిమా అంటే ఎవరూ వదులుకోరు కదా అని అంటున్నారు టాలీవుడ్ ఫ్యాన్స్