క్రిష్ పవన్ సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్స్

క్రిష్ పవన్ సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్స్

0
147

రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ మరో పక్కన తాజాగా సినిమాల్లో కూడా నటించేందుకు సిద్దం అయ్యారు, పింక్ సినిమా షూటింగులో ఆయన పాల్గొన్నారు, అయితే ఇది కూడా కేవలం నాలుగు నెలల్లో పూర్తి అవనుందట, తాజాగా ఈ సినిమా కోసం ఆయన కాల్షీట్లు కూడా దాదాపు 40 ఇచ్చారు అని తెలుస్తోంది.

దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది అనే విషయం తెలిసిందే. ఇక మరో వైపున క్రిష్ దర్శకత్వంలోని సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో పవన్ వున్నాడు. అయితే వరుసగా ఈ సినిమాకూడా షూటింగ్ జరగనుంది అని తెలుస్తోంది.

అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే క్రిష్ స్టోరీ వర్క్ లో బిజీగా ఉన్నారు, ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరిగిపోతున్నాయి. చారిత్రక నేపథ్యంతో కూడిన ఒక ఎమోషనల్ పాయింట్ ను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. అంతేకాదు పవన్ ఇప్పటి వరకూ కనిపించని పాత్ర చేస్తున్నారు, ఈ చిత్రంలో దొంగగా పవన్ కనిపిస్తారట.
పవన్ సరసన కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో కంచె సినిమాతో ఆమె తెలుగులో మంచి ఫేమ్ సంపాదించుకుంది.