ప్రెగ్నెన్సీ వార్తలపై హీరోయిన్ కాజల్ భర్త క్లారిటీ..న్యూ ఇయర్ రోజు ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Heroine Kajal's husband responds to pregnancy news..post viral

0
102

హీరోయిన్ కాజల్​ కు 2020 అక్టోబరు చివర్లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దీనితో ప్రస్తుతం సినిమాలు ఏవి చేయడం లేదు. ‘ఆచార్య’ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసి భర్తతో సమయాన్ని ఆస్వాదిస్తోంది. అయితే ఆమె గర్భవతి అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.

దీనిపై ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ న్యూ ఇయర్ సందర్భంగా కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ ఇన్​స్టా వేదికగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. కాజల్ ఫొటోను పోస్ట్ చేసిన గౌతమ్.. ప్రెగ్నెంట్​ ఉమన్ ఏమోజీని క్యాప్షన్​లో పోస్ట్ చేశారు. తద్వారా అధికారికంగా ఈ విషయాన్ని చెప్పినట్లయింది.

https://www.instagram.com/stories/kitchlug/?

కాజల్ హీరోయిన్​గా.. తమిళంలో ‘కరుంగపియమ్’, ‘ఘోష్టీ’, ‘హే సినామిక’ సినిమాల షూటింగ్ పూర్తయింది. తెలుగులో ‘ఆచార్య’, హిందీలో ‘ఉమ’ చిత్రీకరణ కూడా పూర్తయింది. ‘ఇండియన్ 2′(తెలుగులో భారతీయుడు 2)లో హీరోయిన్​గా నటిస్తోంది. ‘క్వీన్’ తమిళ రీమేక్ ‘పారిస్ పారిస్'(తమిళం) రిలీజ్ కావాల్సి ఉంది.