బర్త్ డే పార్టీలో డ్రగ్స్ – అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్ 

Heroine naira nehal shah found at a birthday party with drugs

0
116
actress naira nehal shah
ఇటీవల సినిమా నటులు డ్రగ్స్ వాడుతూ దొరుకున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా ఓ నటి పుట్టిన రోజు వేడుకల్లో డ్రగ్స్ కలకం రేపాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ రాకెట్ మళ్లీ కుదేపేస్తోంది.
తాజాగా బాలీవుడ్ నటిని ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ అయింది.
ముంబై నగరం జుహులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బాలీవుడ్ యువ నటి నైరా నేహాల్ షా స్నేహితులకి పార్టీ ఇచ్చింది. ఈ సమయంలో అక్కడ డ్రగ్స్ వాడుతున్నారు అని పోలీసులకి సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
ఈ రైడ్లో నటి నైరా నేహాల్ షాతో పాటు ఆమె స్నేహితుడు అశిక్ సాజిద్ హుస్సేన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో హోటల్పై పోలీసులు దాడి చేశారు. ఇక్కడ పార్టీలో డ్రగ్స్ వాడారని అక్కడ నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక వీరికి డ్రగ్స్ ఎలా వచ్చాయి అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.