దిల్ సినిమాలో నటించిన హీరోయిన్ నేహ – ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా

Heroine Neha who starred in Dil movie - Do you know what she is doing now

0
891
Neha Bamb

నితిన్ నటించిన దిల్ సినిమా గుర్తు ఉందా. ఈ సినిమా ఎంతో సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మీకు గుర్తుందా. ఆమె ఎలా ఉంది, ఏం చేస్తోంది అనేది ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి తర్వాత పరిశ్రమకు దూరం అయింది అందాల తార నేహా.

2003లో విడుదలై ఘన విజయం సాధించిన దిల్ చిత్రంలో హీరోయిన్ నందిని పాత్రలో కనిపించింది నేహా. ఆ తర్వాత అతడే ఒక సైన్యం చిత్రంలో నటించింది. తర్వాత బొమ్మరిల్లు చిత్రంలో సుబ్బలక్ష్మి అనే పాత్రలో కనిపించింది. తర్వాత దుబాయ్ శీనులో జేడీ చక్రవర్తి భార్య పాత్రలో పూజాగా నటించింది. ఇక తర్వాత సినిమాలకు దూరమైంది.

2009లో జీ టీవీలో ఓ సీరియల్లో నటించి ఆ తర్వాత బుల్లితెరకు కూడా దూరమయింది. తర్వాత వివాహం చేసుకున్న నేహ ఓ పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం కుటుంబంతో హ్యపీగాఉంది. మరి ఆమె సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడతారో లేదో చూడాలి.