‘చైతూతో విడాకులు..హీరోయిన్ సమంత సంచలన వ్యాఖ్యలు

Heroine Samantha sensational comments

0
97
samantha fan

యువహీరో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కెరీర్​ మరింత జోరుగా ముందుకెళ్తోంది. సోషల్​మీడియాలోనూ చురుగ్గా ఉంటూ స్ఫూర్తినిచ్చే వ్యాఖ్యలను పోస్ట్​ చేస్తోంది సామ్. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ చైతూతో విడిపోయిన తర్వాత తన జీవితం ఎలా ఉందనే విషయమై మాట్లాడింది. విడాకుల అనంతరం తాను మానసికంగా కృంగిపోయి చనిపోతాననుకున్నానని ..కానీ ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసుకొని ధైర్యంగా నిలబడ్డానని చెప్పుకొచ్చింది.

మన సమయం బాగోలేదంటే వీలైనంత త్వరగా దాన్ని స్వీకరించాలి. అర్థం చేసుకోవాలి. అప్పుడు సగం భారం తగ్గిపోతుంది. అదే మనం ఆ పరిస్థితిని స్వీకరించలేకపోతే దానితో జీవితాంతం పోరాడుతూనే ఉండాలి. ‘ఇది నా సమస్య, అయితే ఏంటి? జీవించాల్సిందేగా’ అని మీరు భావిస్తే జీవితం ముందుకు వెళ్తుంది. నా వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సమస్యలతో ఇంకా నేను పోరాడుతూనే జీవిస్తున్నా.

అయితే ఈ క్రమంలో నేను ఎంత బలవంతురాలినో అర్థమైంది. మొదట నేను బలహీనురాలినని భావించేదానిని. విడాకులు తీసుకున్న తర్వాత కుంగిపోతాను, చచ్చిపోతానేమో అని అనిపించింది. కానీ నేను అలా లేను. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత బలంగా ఉంటానని అస్సలు ఊహించలేదు. ఈరోజు ఇలా ఉండటాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్నా అని సమంత పేర్కొంది.