భాషలతో సంబంధం లేకుండా దేశంలోని అన్ని ఇండస్ట్రీల్లో హీరోయిన్ తాప్సీ సత్తా చాటుతోంది. తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ఝుమ్మంది నాదం’తో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు సౌత్ సినిమాలు పూర్తిగా మానేసి బాలీవుడ్మీద మాత్రమే ఫోకస్పెట్టింది. తాజాగా హిందీ పరిశ్రమలో 10 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదమవుతున్నాయి.
‘దక్షిణాదిలో స్టార్డం మాత్రమే దక్కింది. బాలీవుడ్లో మంచి పాత్రలు సెలక్ట్ చేసుకోవడం వల్ల గొప్ప సినిమాలు చేయగలిగాను. ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉన్నాను. సౌత్‌లో అలాంటి ఫీలింగ్కలగలేద’ని చెప్పింది. దీంతో ఇక్కడి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక్కడ కూడా మంచి పాత్రలు సెలక్ట్ చేసుకుని ఉంటే సరపోయేది కదా అంటూ తాప్సీపై సెటైర్లు వేస్తున్నారు. తనను తెరకు పరిచయం చేసిన ఇండస్ట్రీని అవమానించడం ఏంటని ఆమెపై ట్రోల్స్‌కి దిగుతున్నారు.