‘హాయ్ నాన్న’ ట్రైలర్ వచ్చేసింది.. ఫీల్ గుడ్ సస్పెన్స్..

-

ఈ ఏడాది ‘దసరా’ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన హీరో నాని(Nani) తాజా చిత్రం ‘హాయ్ నాన్న(Hi Nanna)’ ట్రైలర్‌ విడుదలైంది. ఈ ట్రైలర్‌లో నాని, కూతురుకు అమ్మ గురించి తన గతం చెప్పడం.. ఇందులో శృతిహాసన్‌ను చూపించడం.. మధ్యలో నాని జీవితంలోకి మృణాల్ వచ్చాక ఏమైంది అంటూ సస్పెన్స్‌ రేకెత్తించారు. దీంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. నాని 30వ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకి శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించారు.

- Advertisement -

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చెరుకూరి వెంకట మోహన్, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. హేషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన మూవీ సాంగ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా సినిమా(Hi Nanna) పబ్లిసిటీలో భాగంగా ఇటీవల రాజకీయ నాయకుడిగా నాని చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రెస్‌మీట్లను అనుకరిస్తూ చేసిన వీడియోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందని నాని భావిస్తు్‌న్నాడు.

Read Also: ఈ వారం థియేటర్లలో సందడి చేసే సినిమాలు ఇవే..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...