పుష్ప-2(Pushpa 2) సినిమా టికెట్ ధరల పెంపుపై సతీష్ అనే వ్యక్తి హైకోర్టుకు వెళ్లారు. పెరిగిన టికెట్ ధరల కారణంగా సామాన్యుడు సినిమా చూసే పరిస్థితి లేకుండా పోయిందంటూ పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ‘పుష్ప-2’ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికిప్పుడు సినిమా రిలీజ్‌ను అడ్డుకోలేమని, ఆ దిశగా ఆదేశాలు కూడా జారీ చేయలేమని న్యాయస్థానం తెలిపింది.
కానీ బెనిఫిట్ షో వసూళ్లకు సంబంధించి వివరాలను తమకు అందించాలని తెలంగాణ హైకోర్టు.. మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)ను కోరింది. అయితే బెనిఫిట్ షో పేరిట రూ.800 వసూలు చేయడం అన్యాయమని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై విచారణ చేసిన న్యాయస్థానం.. సినిమా(Pushpa 2) విడుదలను అడ్డుకోలేమని స్పష్టం చేసింది.
‘‘పూర్తి నివేదిక పరిశీలించి ఆదేశాలు ఇస్తాం. అదే విధంగా టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను సైతం పరిశీలిస్తాం’’ అని న్యాయస్థానం తెలిపింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 17కు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలతో ప్రస్తుతానికి పెరిగిన ధరలతోనే టికెట్ అమ్మకాలు కొనసాగనున్నాయి. అయితే ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ఒక్కో టికెట్ రూ.3000 ధర కూడా పలుకుతుంది.