‘RRR’ నుండి ఎత్త‌ర జెండా సాంగ్ ప్రోమో విడుద‌ల (వీడియో)

0
127

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కేసులు పెరగడంతో సినిమాను వాయిదా వేశారు మేకర్స్. దీంతో మెగా నందమూరి అభిమానులు నిరాశకు గురయ్యారు. అదే సమయంలో మార్చి 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్.

అయితే సినిమా రిలీజ్ కు ముందు ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇవ్వనుంది ఆర్ఆర్‌ఆర్ టీం. ఈనెల 14న ట్రిపుల్ ఆర్ సెలబ్రేషన్ ఆంథమ్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో చిత్రంపై మరింత హైప్ పెంచేందుకు సెలబ్రేషన్ ఆంథమ్ సాంగ్ ను విడుదల చేయనుంది. దీనికి సంబంధించి పోస్టర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్ ముగ్గురు కూడా మెస్మరైజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పిక్స్ చూస్తేఅర్ధమవుతుంది.

తాజాగా ఈ సెలబ్రేషన్ ఆంథమ్ సాంగ్ కు సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు. నెత్తురు మ‌రిగితే ఎత్తర జెండా.. స‌త్తువ ఓరిమితే కొట్ట‌రా కొండా.. అంటూ సాగే ఈ పాట ప్రోమోలో రామ్ చ‌ర‌ణ, తారర్ అభిమానుల్లో అంచ‌నాల‌ను ఇంకా పెంచుతున్నారు.

https://www.youtube.com/watch?v=BN1MwXUR3PM