టాలీవుడ్లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరో ఎవరంటే? వెంటనే చెప్పే పేరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ .ఎందుకంటే నిర్మాతలు దర్శకులు ఆయన డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. కమర్షియల్ సినిమాలకి ఎంత డిమాండ్ ఉంటుందో తెలిసిందే. ఇక భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్ తో సినిమా చేసి రిలీజ్ చేస్తే, నిర్మాతలకు అది పండుగే భారీ లాభాలు వస్తాయి.
ఇక చాలా గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ చిత్రం చేశారు. కరోనా ఎఫెక్ట్ ఉన్నా వసూళ్లతో అదరగొట్టేసింది. బాక్సాఫీస్ ని షేక్ చేసింది. పవన్ రోజువారీ రెమ్యునరేషన్ కింద రోజుకు కోటి రూపాయల వరకు తీసుకుంటారనే టాక్ టాలీవుడ్ లో ఉంది. ఇంత భారీ రెమ్యునరేషన్ ఇప్పుడు ఉన్న హీరోలకి లేదట.
భారీ బడ్జెట్ సినిమాలు అయితే ఒక్కో సినిమాకి పవన్ రెమ్యునరేషన్ రూ.40 నుంచి రూ.50 కోట్లు ఉంటుందని, ఆయన సినిమాకి 30 నుంచి 50 రోజుల డేట్స్ ఇస్తారని టాలీవుడ్ లో అంటున్నారు. మొత్తానికి ఈ వార్త విని ఆయన అభిమానులు ఎంతో ఆనందంలో ఉన్నారు. ప్రస్తుతం పవన్ మరో రెండు చిత్రాలు సెట్స్ పై పెట్టిన విషయం తెలిసిందే.